Hyderabad: Kinige, 2007. — 179 p.
పాఠకుల జీవితాలను శాశ్వతంగా మార్చివేసే పుస్తకాలు ఎప్పుడోగాని ప్రచురితం కావు. అటువంటి పుస్తకాల్లో పాలో కొయిలో రాసిన 'పరుసవేది' ఒకటి. ఇప్పటికే ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాలలో 66 భాషలలోకి అనువాదమయ్యింది. నాలుగుకోట్ల ప్రతులకు పైగా అమ్ముడుపోయాయి.
యాండలూసియాలో గొర్రెల కాపరి అయిన శాంటియాగో అనే యువకుడు నిధి కోసం అన్వేషించే అద్భుతకథ ఇది. తన స్వదేశమైన స్పెయిన్‌ని విడిచి టాంజియర్స్‌లోని బజార్లు, ఈజిప్టులోని ఎడారికి చేరతాడు. అక్కడ అతని కోసం ఒక పరుసవేది ఎదురుచూస్తూ ఉన్నాడు.
మన హృదయాలను ఆలకించడం గురించి, జీవిత పథమంతా పరచి ఉన్న శకునాలను అర్థం చేసుకోడం గురించి, అన్నిటికీ మించి కలలను అనుసరించడం గురించి ఈ గాథ చెబుతుంది.
ఆలస్యం ఎందుకు? చదవండి ఇక.